Monday, May 11, 2026

 

                      నివాళి

అది..1944వ సంవత్సరం అక్టోబర్ 16 వ తేదీ.. 

కేరళలోని త్రిసూర్ దగ్గర అదొక చిన్న అగ్రహారం.

కేర్ మంటూ .. రెక్క విప్పుకుంది ఓ మంచి కథల మందారం. 

సాహిత్య సరస్వతీ నొసట సింధూరం. 

82 వసంతాల తన జీవన యానంలో జీవ నదిలా ప్రవహిస్తూ ఎల్.ఆర్.

 స్వామి పండించింది మంచి కథల పంట 

మనసుపెట్టి  వండింది అనువాదాల వంట.

వడ్డించింది మంచి గంధం లాంటి మానవత్వాన్ని ఇంటింట. 

సాహిత్య సాగరంలోకి దూకింది మొదలు రాతల ఈత ఆగనే లేదు..

మన అందరిదీ ఒకటే మానవ గోత్రమని ప్రకటించి 

తిమింగలాలను పట్టే వల నిర్మాణానికి, కలకంటూ.. 

కొబ్బరి ఆకుల నిబ్బరం నిండిన మలయ మారుతాలని 

సాగరతీర సమీరంతో మేళవించి.. 

కథా కేరళ పరిమళాన్ని పదిమందికి 

పంచిపెట్టిన మంచి మనసు స్వామిది.      

ప్రజాస్వామ్య ప్రభుత్వం పాడైపోతుందంటూ 

హెచ్చరించే కథాస్వామ్య ప్రభ్రుతత్వం తనది. 

సామెతలతో మెదడుకు మేత వేసి, 

కొండంత సమాజాన్ని కొంతసేపు కథల అద్దంలో చూపించి,  

గోదావరి స్టేషన్ వంతెన దాటుకుంటూ 

తెగిపోయిన మానవ సంబంధాలను వెతికి అతికించి, 

ఆటవిక రాజ్యాన్ని అనువాదంతో ధిక్కరించి, 

20వ శతాబ్దపు ఇతిహాసాన్ని నినదించి, 

 పాండవపుర వీధుల్లో ఆదిశక్తి పాదముద్రలతో 

తర్జుమాల తాండవ మాడించి,.

సూఫీ చెప్పిన కథలను తాపీగా కాఫీ తాగినట్లు వినిపించి 

కథ ఆకాశంలో బతుకు వెన్నెల కాయించే కలం స్వామి గారిది 

మట్టి వాసనకి.. పిట్ట వాసనకి మధ్యన 

మనిషి మనసు లోగుట్టు తెలిసిన పెరుమాళ్ల లా.. 

కథలనే కాదు కవిత్వాన్ని కూడా పంచి ఇచ్చిన 

అనంత పద్యనాభుడు, ఎ ల్లార్ స్వామి. 

ఈ వాక్యాలకు వార్ధక్యం.. లేనేలేదు. 

అది నిత్య చైతన్య గంగా ప్రవాహం. 

ఆ భావజాలం అజరామరం.. 

అందుకే మా కథల స్వామికి మనసున పూచిన మల్లెపూల దండ.

[15:22, 04/05/2026] Garimella VS Nageswararao: 

No comments: