Friday, August 2, 2013

నీటి కష్టాలకు పొదుపు మంత్రమే విరుగుడు

నీటి కష్టాలకు పొదుపు మంత్రమే విరుగుడు

  • -గరిమెళ్ల నాగేశ్వరరావు
  • 31/07/2013
సృష్టిలో మానవునిది ఒక ప్రత్యేక జీవన శైలి. తనవైన తెలివితేటలతో, ఆలోచనా విధానంతో అనూహ్య ప్రగతిని సాధిస్తూ ఇతర ప్రాణులన్నింటిపైన ఆధిపత్యాన్ని చెలాయిస్తూ తన మనుగడని నిరంతరాయంగా కొనసాగిస్తున్నాడు. అయితే- స్వార్థపూరితమైన తన స్వభావంతో తనకి తెలియకుండానే, విలువైన సహజ వనరులని వృథా చేస్తూనో, విచక్షణా రహితంగా కలుషితం చేస్తూనో... భావి తరాలకి తీరని ద్రోహం చేస్తున్నాడు. దీంతో కష్టాలని కొని తెచ్చుకుంటున్నట్లు అవుతోంది.
‘సృష్టిలో నిరంతరాయంగా మనుగడను సాగించగలిగేవి.. బలమైన లేదా తెలివైన జీవరాశులు కాదు.. మార్పుకి అనుగుణంగా ఎప్పటికప్పుడు తమ జీవన విధానాన్ని మార్చుకోగలిగే జీవరాశులే’-అంటాడు అరిస్టాటిల్.
నిత్య జీవితంలో మనం తెలియకుండా చేసే పొరపాట్ల వల్ల, నిర్లక్ష్యం వల్ల అంతులేని నష్టం జరుగుతోందన్నది కాదనలేని నిజం. పొరపాట్లను సరిచేసుకుంటూ, నిపుణుల సూచనలను తెలుసుకొని అమలు జరపడం ద్వారా నష్టాన్ని నివారించుకోవచ్చు. మనకి తెలిసిన విషయాలను నలుగురితో పంచుకుంటూ సమాజ అభ్యున్నతికి దోహదపడడం ఒక ఉత్తమమైన, ఉన్నతమైన సంస్కారం. నీరు, చమురు వంటి సహజ వనరులను పొదుపుగా వినియోగించుకోవడం, పర్యావరణాన్ని కాలుష్యానికి గురి కాకుండా చూసుకోవడం, ఎయిడ్స్ లాంటి ప్రమాదకరమైన వ్యాధులు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఇపుడు మనముందున్న సవాళ్లు.
నీరే జీవనాధారం..
మానవ జీవితం ఆరంభమైంది నీటితోనే అని శాస్తవ్రేత్తలు చెబుతున్నారు. తల్లిగర్భంలో మనందరం ఊపిరిపోసుకొనేది ఉమ్మ నీటిలోంచే. నీరు లేకుంటే సృ ష్టిలో ఏ ప్రాణీ జీవించలేదు. జంతువులు, పక్షులు, మొక్కలు.. ఇలా అన్ని జీవులూ నీటిమీద ఆధారపడే జీవిస్తున్నాయి. మానవ శరీరంలో 65 శాతం బరువు నీటిదే. జలానికి కరవు వస్తే జనం వణికిపోతారు. జలం మరీ ఎక్కువైతే జనం మునిగిపోతారు. ఒక మతంలా.. ఒక ఆదర్శంలా.. జలానికి జనాన్ని కదిలించే శక్తి ఉంది. భూమిమీద నాలుగింట మూడొంతులు నిండి ఉన్నది నీరే. కానీ ఏం లాభం? ఒకే ఒక్క శాతం తాజా అయిన స్వచ్ఛమైన తాగునీరు ఉంటుంది. అందులో మనకి దొరికేది 0.08 శాతమే. మొత్తం నీరు ఒక గాజు గ్లాసు నిండా ఉందనుకుంటే మనకి దొరికేది చెమ్చాలో సగం కంటే తక్కువ. అందుకే మనం నీటిని అనుక్షణం జాగ్రత్తగా వాడుకోవాలి.
సాగరాలలో తాగడానికి పనికిరాని ఉప్పునీరూ, ధృవాల దగ్గర గడ్డకట్టిన మంచినీరు పోగా- మనకి దొరికే నీరు చాలా తక్కువే. తాగునీటిని కొనుక్కోవడమన్న విషయాన్ని ఒకప్పుడు ఎవరూ కనీసం ఊహించి ఉండరు. కానీ, ఇప్పుడు అది సర్వసాధారణమైపోయింది. మన పూర్వీకులు చాలా తెలివైన వాళ్ళు. దశాబ్దాల క్రితం అనేక చెరువులు, కాల్వలు తవ్వి నీటిని పొదుపుగా వాడుకొనేవారు. కానీ, నేడు మనం వాటిని ని ర్లక్ష్యం చేయడంతో చా లావరకూ అవి నిరుపయోగంగా మారాయ.
ఒకప్పుడు విరివిగా దొరికే మంచినీరు ఇప్పుడు కలుషితమైపోయ అనేక ఆ రోగ్య సమస్యలను సృష్టిస్తోంది. మన దేశంలోని అనేక నగరాల్లో తాగునీరు దొరక్క జనం కటకటలాడుతున్నారు. గ్రామాల్లో మహిళలు కడివెడు నీళ్ళకోసం మైళ్ళకొద్దీ నడవాల్సి వస్తోంది. కలుషితమైన నీటి వినియోగం వల్ల అనేక చోట్ల ప్రాణాంతకమైన వ్యాధులు ప్రబలుతున్నాయి. మరొకసారి ప్రపంచ యుద్ధం అంటూ వస్తే- అది నీటి గురించే అన్న వాదన ప్రచారంలో ఉంది. ఇప్పటికే ఒక గ్రామం మరొక గ్రామంతోనూ, ఒక రాష్ట్రం మరొక రాష్ట్రంతోనూ చివరికి- ఇరుగుపొరుగు ఇళ్లలో నివసించే వారి మధ్య సైతం నీటి కోసం ఘర్షణలు జరుగుతున్నాయ.
అధిక జనాభా, నగరాల సంఖ్య, పరిశ్రమల కారణంగా నీటికి కొరత ఏర్పడుతోంది. అదుపులేని వినియోగం, ఆలోచన లేని నిర్వహణ, అడుగంటిపోతున్న భూగర్భ జలాలు, వర్షాభావం వంటివి నీటి కొరతకు కారణమై కన్నీటిని తెప్పిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని 8 జిల్లాలు అనునిత్యం కరవు కోరల్లో సతమతమవుతుంటాయి. ఫలితంగా రైతుల ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయ. భవిష్యత్తులో ఈ సమస్య మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. అందుకనే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం, ఇతరులకు అవగాహన కలిగించడం వలన కొంతవరకు నష్టాన్ని తగ్గించుకోగలుగుతాం. కొన్ని జాగ్రత్తలను, పొదుపు సూత్రాలను పాటించక తప్పదని నిపుణులు ఎప్పటి నుంచో సూచిస్తున్నారు.
ఇలా ఆదా చేద్దాం...
* స్నానం చేయడానికి బకెట్లోకి నీటిని తీసుకొని మగ్గుతో పోసుకోవడం మం చిది. కుళాయి కింద నిలబడి స్నానం చేయడం వలన నీరు వృథా అవుతుంది.
* పళ్ళను, కూరగాయలను కడిగేటప్పుడు వాటిని ఒక పాత్రలోనికి తీసుకుని కడగటం వలన నీటిని కొంతవరకైనా పొ దుపు చేయొచ్చు.
* ఉపయోగించిన నీటిని మొక్కలకి మళ్లించడం మం చిది.
* ఇంట్లో కుళాయి గొట్టాలకు లీకులు ఉంటే వెంటనే మరమ్మతులు చేయించాలి. చుక్క, చుక్క చొప్పున చాలా నీరు వృథా అవుతుంటుంది.
* షేవింగ్ లేదా పళ్ళు తోముకునేటప్పుడు కుళాయిని తె రచి ఉంచడం వలన నీరు వృథా అవుతుంది.
* చిన్న చిన్న షవర్లు వా డినట్లయతే నీటి ధారను తగ్గించి పొదుపు చేయవచ్చు.
* చేతులు, కాళ్ళు కడిగేటప్పుడు కూడా తగినంత నీటినే ఉపయోగించాలి.
* అనవసరంగా, మాటిమాటికీ టాయ్‌లెట్‌లోని ఫ్లష్‌ను ఉపయోగించకూడదు.
* తాగేనీరు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
* ప్రతి ఇంటి వెనుక ఒక ఇంకుడు గొయ్యని తప్పక తవ్వి, వాన నీటిని దానిలోనికి మళ్లించాలి.
* పాడైన చెరువులు, బావులలో పూడిక తీయంచి, తిరిగి వినియోగంలోనికి తీసుకురావాలి.
* పుష్కరాలు, కుంభ మేళాల సమయంలో, ఇతర సందర్భాల్లో నదులలో స్నానం చేసేటప్పుడు షాంపూలను వాడకూడదు.
* వినాయక చవితి వంటి పండగ సమయాలలో రసా యనాలు వాడని విగ్రహాల తయారీని ప్రోత్సహించాలి.
* నీటిని పొదుపు చేయడం పిల్లలకు ఒక అలవాటుగా నేర్పించాలి.
* పాఠశాలలో నీరు వృథా అవుతూంటే వెంటనే విద్యార్థులు టీచర్ల దృష్టికి తీసుకువెళ్లాలి.
* నీటి ప్రాముఖ్యత గురించి బొమ్మల ద్వారా, పాటల ద్వారా, నాటికల ద్వారా ప్రచారం చెయ్యాలి.
మనం ఎలాంటి ఆహారం తీసుకోకుండా కొన్ని రోజులు బతగ్గలం. నీరు తాగకుండా వారంరోజుల కంటే ఎక్కువ బతకలేమని శాస్తవ్రేత్తలు చె బుతున్నారు. బిందువు,బిందువు కలిసి సింధువుగా మారినట్లు... చుక్క చుక్క కలిస్తేనే నీరు ప్రవాహంగా మారి పరవళ్ళు తొక్కుతుంది. అందుకే ఒక్క నీటి చుక్కతోనైనా పొదుపు చేసే పనిని ఆరంభించాలి మనం. మర్యాద రామన్న కథలో- నీటి వినియోగాన్ని బట్టి మనిషి నైజాన్ని అంచనా వేయడం మనకి తెలిసిన విషయమే కదా! కాకి కథలో- తనకి ఎంత దాహం వేసినా సొంత తెలివి ఉపయోగించి కాకి నీళ్ళని పైకి రప్పించిందే కానీ కుండని పగులగొట్టలేదు కదా? విలువైన నీటి వనరులని కలుషితం చేయకుండా పొదుపుగా వినియోగించుకోవడం నేడు ప్రజలందరి తక్షణ క ర్తవ్యం. గాలి, నీరు వంటి పంచభూతాలను కలుషితం కాకుండా చూసుకున్నప్పుడే మనిషి మనుగడ పదికాలాలపాటు హాయిగా కొనసాగుతుంది. దీనికి మన వంతు ప్రయత్నం చేద్దాం.

No comments: