Friday, March 15, 2013


సుఖ దుఃఖాలు


దుఃఖం... రుచేంటో తెలీదు
ఎదుటోడి సుఖం మాత్రం ఎప్పుడూ దుఃఖమే.
సుఖం తియ్యగా ఉంటుందట.. కానీ
తీపిలో అంత సుఖం లేనే లేదు.
ఓటమికంటే పొరుగువాడి గెలుపు
దరద్రంకంటే ఇంకొక్కడి బలుపు
భరించేందుకు.. బాధగానే ఉంటాయ్.
ఓదార్పునైనా తట్టుకునే ఓర్పుండాలి
నిట్టూర్పునుండి తప్పుకునే నేర్పు నేర్వాలి.
జాలిని భరించడం జాలిపడేంత సులువా?
దానాన్ని తీసుకోవడంలో..
ఇచ్చేటప్పుడుండే ధైర్యం ఉండదు.
క్షమాపణలు కోరేటప్పుడు...
ఒప్పుకునేంత ఔదార్యం దొరకదు.
యుద్ధంచేసేవాడి తెగువ..
రాజీలో కనబడదు.
నిజంలోని నిర్భయం..
అబద్ధానికణువైనా.. అందదు..
అయినా ఎందుకనో...
సుఖాన్ని వెదుకుతూ కష్టపడలేక
దుఃఖంలో బ్రతుకుతూనే, సుఖపడిపోతున్నాం!

No comments: