Thursday, March 21, 2013



welcome


Kittayya alaka - geyam


ETV2 lo oka parichayam -Telugu telugu telugu


Friday, March 15, 2013


సుఖ దుఃఖాలు


దుఃఖం... రుచేంటో తెలీదు
ఎదుటోడి సుఖం మాత్రం ఎప్పుడూ దుఃఖమే.
సుఖం తియ్యగా ఉంటుందట.. కానీ
తీపిలో అంత సుఖం లేనే లేదు.
ఓటమికంటే పొరుగువాడి గెలుపు
దరద్రంకంటే ఇంకొక్కడి బలుపు
భరించేందుకు.. బాధగానే ఉంటాయ్.
ఓదార్పునైనా తట్టుకునే ఓర్పుండాలి
నిట్టూర్పునుండి తప్పుకునే నేర్పు నేర్వాలి.
జాలిని భరించడం జాలిపడేంత సులువా?
దానాన్ని తీసుకోవడంలో..
ఇచ్చేటప్పుడుండే ధైర్యం ఉండదు.
క్షమాపణలు కోరేటప్పుడు...
ఒప్పుకునేంత ఔదార్యం దొరకదు.
యుద్ధంచేసేవాడి తెగువ..
రాజీలో కనబడదు.
నిజంలోని నిర్భయం..
అబద్ధానికణువైనా.. అందదు..
అయినా ఎందుకనో...
సుఖాన్ని వెదుకుతూ కష్టపడలేక
దుఃఖంలో బ్రతుకుతూనే, సుఖపడిపోతున్నాం!

Wednesday, March 13, 2013

balalakosam oka geyam

:గరిమెళ్ళ నాగేశ్వరరావు //కిట్టయ్య అలుక//

మట్టి ముట్టొద్దంటు
గట్టిగ తిడితే..
పొన్నసె ట్టు కింద
సిన్ని కిట్టయ్య
అమ్మమీద అలిగి
బొమ్మల్లె కూసుంటె

సిలకొకటి సూసింది
పండట్టుకొచ్చింది
కిట్టయ్య ఎదురూగ
కొరికి ఇసిరేసింది
పండు సూసిన సామి
ముక్కొకటి కొరికీ..
పరమాన్నమనుకొంటూ
పరుగెత్తె..ఉరికీ..
సంతసాన సామి
అమ్మ సెంతకు సేరి
తీయగ ఉందనీ
అమ్మకి తినిపిస్తే…..

పండునొదిలీ ..అమ్మ
బుగ్గకొరికిందీ
అలక మాని తండ్రి
సిలకల్లె నవ్వంటు..

సిన్ని కిట్టా..నువ్వు
వెన్నల్లె నవ్వాలి..
వెయ్యేళ్ళు నవ్వాలి
పువ్వోలె నవ్వాలి
పున్నమిల నవ్వాలి
కలకలా నవ్వాలి
కడలి లా నవ్వాలి
ముత్తాలు రాలగా..
మురిపాన నవ్వాలి
నవ్వాలి..నవ్వాలి
కిట్టయ్య నవ్వాలి
కిట్టయ్య నవ్వులో
కట్టాలు మరిచి
జనమంత నవ్వాలి
జగమంత నవ్వాలి
published in Telugu velugu (posted in kavisangamam on 14/3/2013)