Sunday, October 14, 2012

isitralu - mini poems

ఇసిత్రాలు

కాలినడకన పోయినోడు
కాశీకి చేరాడట
ఎలగోలాగ...

రైలు ఎక్కినవాడు
రానే లేదట
కాలి మసయ్యాడు
దిగేలోగా!!





ఇసిత్రాలు

పాము కరిచినవాడు
బతికేశాడట..
సమయానికి ఏంటీ వీనం ఎక్కిస్తే!

దోమ కాటుకే
మరణించాడట
డెంగ్యూ తో మంచం ఎక్కేస్తే!!

నాగుపాము కంటే నాలుగు దోమలే ప్రమాదం
నవ నాగరిక ప్రపంచంలో





కోడికూత

కొక్కొరొకో...!

తెల్లారితే

క్విడ్..ప్రోకో..!!





వీడిచ్చిన

బెయిలు తోటే వాడెవడో

బయటకి..!

అందరికీ బెయిలు ఇచ్చిన

వీడు మాత్రం లోపలికి ..!!

రూపాయిలో.. పాపం దాగుంది





ఇసిత్రాలు

బోరుబావిలో పడ్డ పిల్లాడు

బ్రతికేసాడు..ఆక్సిజన్ అందిస్తే..!

హాస్పిటల్ లో పుట్టిన శిసువు మాత్రం

హరీ అందట.. ఆక్సిజన్ సిలిండర్ అయిపోయందని!!



No comments: