Tuesday, September 25, 2012

kavitotsavam....pustakavishkarana


pass port


Thursday, September 6, 2012

At Ramdev plaza, New Delhi

This is taken on 4-9-2009 at Ramdev plaza..New Delhi, in connection with thbe celebrations of receiving a  president award to the teachers

Wednesday, September 5, 2012

my haiku


participating in a kavisammelanam organized by NBT


presenting my book to sri Bhujanga Rao garu, Director, NSTL


థర్మల్ కన్నీళ్లు..


థర్మల్ కన్నీళ్లు..
గరిమెళ్ళ నాగేశ్వర రావు ,  Jun 01, 2011
[హంసిని ఉగాది ఉత్తమ రచనల పోటీలో రెండవ బహుమతి పొందిన కవిత]

పొయ్యిలో గలాల్సిన. అగ్గి..
పొట్టలో రాజుకుంది.

గుండెల్లో రాకాశి బొగ్గు
భగ్గుమన్నప్పుడు..
కలలు కాలిన బూడిద
కళ్ళ ముందు రాలింది.

బతుకు చింతయిన చెట్టు మీద
రాబందు వచ్చి వాలింది.
నీళ్ళలో చేప పిల్ల.. గట్టుమీద పడి
గిలగిలా కొట్టుకుంది.

చెట్టుకొమ్మకి పిట్ట
గుట్టుగా ఉరేసుకుంది.
ఊరు మొత్తం బావురు మంటోన్నప్పుడు
బావి గుండె బరువెక్కింది.

వెన్నెల వేడెక్కనుందని తెలిసి
నులకమంచం వెక్కివెక్కి ఏడ్చింది.
పాడయిపోయే పంటపొలాన్ని చూసి
గుండె ఆగిన ముసల్ది.. పాడెక్కి పోయింది.

పిల్లల తల్లిని గొడ్రాలని పిలిచినట్టు
పచ్చని నేలని పోరంబోకన్నందుకు..
పంటచేను విలవిలలాడింది.

అక్షయపాత్రను లాగేసుకు
బిచ్చం వేస్తామన్నందుకు
రైతుచేతి బడితె.. ఆయుధమయ్యింది.

నాలుగేళ్ల పిల్లది... ఝాన్సీరాణవుతుంది
మూలనున్న ముసలిది రుద్రమదేవవుతుంది.
పంచె బిగించి కదిలిన ప్రతిఒకడూ..
ఒక్కొక్క 'వట్టితాండ్ర' పాపారాయుడే

ఎరుపెక్కిన కళ్ళు భాష్పవాయు గోళాలు
ఒళ్ళంతా రబ్బర్ బుల్లెట్ల తూట్లు..
చెవుల్లో కవాతు చేస్తోన్న ఖాకీ బూట్లు.

నేల మాదన్నందుకే శత్రువులయ్యారు వాళ్ళు
సమాధుల మీద అభివృద్ధి పునాదులోద్దనందుకే
యుద్ధం ప్రకటించారు వీళ్ళు..

నల్లతనం తప్ప నల్లధనం లేని పేదోళ్ళు,
పచ్చదనం తప్ప పచ్చనోట్లు లేనోళ్ళు..

సంక్షేమం మరచిపోయి సంక్షోభం సృష్టిస్తూ..
బ్రతుకుల్లో రాలుతోంది.. బూడిద.
ధర్మం కోసం పోరులో కారుతోన్నవన్నీ
థర్మల్ కన్నీళ్లు...
కాలిపోయిన గుడెసోకటి నిలువునా
కూలినట్టే..
రబ్బరు బుల్లెట్ రాకాసికొర తగిలి
తెగిన తాళిబోట్టోక్కటి నేలకు రాలినట్టే..
వాడి జీవన ఉద్యానవనాన్ని
విద్యుత్ దహనవాటికలో తగలెట్టకు.

పచ్చని ప్లాంట్లన్ని పీకేసి
వెచ్చని ప్లాంటొకటి కట్టేసి
పల్లెని వల్లకాడు చేయకు.

రూపాయి కోసం ప్రకృతి రూపాన్ని తగలెట్టి
ఊరి ఊపిరి తిత్తులలో పొగబెట్టకు

పేదరికం మీద దాడి చేసిన పెద్దరికమేదీ..
పదికాలాల పాటు నిలబడిన దాఖలా లేదు.. నిజం!
 
                                         ***
 
గరిమెళ్ళ నాగేశ్వర రావు గారి పరిచయం (వారి మాటల్లోనే):

ఉపాధ్యాయునిగా పనిచేస్తూ కొమ్మాడి, విశాకపట్నం లో నివసిస్తున్నాను. నేను ఇప్పటివరకు రాసిన సుమారు రెండువందల యాభై కవితలు, నలబై కథానికలు, ముప్పై వ్యాసాలు వివిధ పత్రికలలో ప్రచురించబడ్డాయి. ఇప్పటివరకు రచయితగా 49 అవార్డ్స్, ఉపాధ్యాయునిగా ఏడు నేషనల్ అవార్డ్స్ అందుకున్నాను. 2009 లో ఉత్తమ ఉపాధ్యాయునిగా ప్రెసిడెంట్ అవార్డు పొందాను. 2008 లో నా తెలుగు కవితా సంపుటి "ప్రపంచాక్షరి" వెలువడింది. బహుమతి ఇచ్చి ప్రోత్సహించినందుకు హంసినికి కృతజ్ఞతలు.
 

వై దిస్ కొలవరి కొలవరి డీ! గరిమెళ్ళ నాగేశ్వర రావు , Sep 01, 2012

మామా..దా..పాట పాడదాం!
సూప్ సాంగేదీ వద్దు
ఫ్లాప్ సాంగులూ వద్దు.
జీవితాన్ని నగ్నంగా నిలబెట్టి
నిలువునా.. నిజాల నిప్పులతో కడిగే
నిఖార్సయిన పాటొకటి పాడదాం దా!
కొలవెరి..కొలవెరి డీ!!

గుండెల మీదుగా కాలపు కసాయితనం
నియంతలా నిర్ధయగా నడిచి వెళ్ళిపోతున్నప్పుడు
గుండెలోపల చెలరేగుతోన్న వరుస విస్ఫోటనాల
విలయపు సవ్వడి లయగా ఒకపాట పాడదాం
కొలవెరి..కొలవెరి డీ!!

ఎరుపెక్కిన కళ్ళలో నిత్యం ఉబికే ఒక ఉద్రేకం
విద్యుత్ స్తంభాలమీద లాగి బిగించి కట్టిన తీగల్లా
సాగి.. నిక్వణిస్తోన్న నరనరాలలో వినిపించే తీవ్ర శృతిలో
కాస్సేపైనా కసితో ఊగిపోతూ రేగిపోదాం రా.. మామా!
కొలవెరి..కొలవెరి డీ!!

కొలవెరి అంటే చంపేంత కసి అయితే
నాకిప్పుడు ఎక్కడ చూసినా కొలవెరే
వేవేల వెర్రిగొంతులతో విలపిస్తూ వినిపిస్తోంది
అదొక అంతర్జాతీయ గీతమై
ఆర్తుల విజయనాదమై ప్రతిధ్వనిస్తోంది అనిపిస్తోంది
కొలవెరి..కొలవెరి డీ!!

ఈజిప్టు వీధుల్లో నినదించిన మౌనానికి
అచ్చమైన అనువాదం అది.
హిట్లర్ పతనంలో.. నాజీల గోరీల్లో
అన్నా హజారే అడుగుల్లో
అదిగదిగో కొలవరి కలవరిస్తోన్న సవ్వడి!

పండుతోందనుకున్న వరి నిలువునా ఎండుతోన్నప్పుడు
బతికుండగానే తల్లికి తలకొరివి పెడుతోన్న తనయుడిలా
తల్లడిల్లుతోన్న రైతు కళ్ళల్లో ఉరికే కొడవలి కొలవరి.

రూపాయి నోటులా దేహం నలిగి పొతోన్నప్పుడు
అర్ధ రాత్రి అర్ధ నిమీలిత నేత్రాలలో
తొంగి చూస్తోన్న ఎర్రటి జీరలో కనిపించే రవికిరణం కొలవరి

రాత పరీక్షలేవీ తలరాతను మార్చ లేకపోతోన్నప్పుడు
అవినీతిని అధిగమించలేని అసహాయత
బోధించే భగవద్గీత అందించే ఆఖరి అస్త్రం కొలవరి

మెలమెల్లగా పల్లెని వాణిజ్యం వాటేసుకొంటోన్నప్పుడు
వలస పోలేని బ్రతుకు తెరువు ఎదురు తిరిగి
ఊరి పొలిమేరల్లో ఉరుమురిమి వేస్తోన్న ఆకలిదరువు కొలవెరి

గాంధీ గారి వీధిలో బ్రాందీ గ్లాసులో కన్నీరు కలిపి
లాగిస్తోన్న పెగ్గుమీద పెగ్గు సిగ్గునొదిలేసినప్పుడు
అగ్గిమీద గుగ్గిలమయ్యే ఇల్లాలి మనసులో
కసిగా కవాతు చేసే గీతం.. కొలవరి డీ!

పప్పాప పాయ్..పప్పాప పాయ్...పప్పాప పాయ్
అనాధ శిశువుల ఆకలి కడుపుల ఆక్రందనలో
వేధించే వేదన చేసే రిథం ఇది

అశాంతి రేపిన అలల అలజడి జడిలో..
పెల్లుబికే శోకం ఒక సునామీ
విశ్వమానవ గళాల్లో గరళాన్ని తీసి
అమృతాన్నినింపే పాటొక్కటి పాడదాం!

మామా చేంజ్ ది లిరిక్స్....
ప్రెమ.. కరుణ ..శాంతి.. సహనం
కసా బిసా.. కలగలిపి..
ఊపునిచ్చేపాట..నిద్ర లేపే పాట
పాడదాం కొలవరితో కొట్టేందుకు ఢీ!
మరి లేటెందుకు గెట్ రెడీ!!