పాట పాడుకుందాం.
పద ముందుకు..
భయమెందుకు
కదిలేదే కదా జీవితం!
కష్టమైనా ..సుఖమైనా
ఎదురయ్యే ప్రతి అనుభవం
ఎదలోన దాచేసి
తుదివరకు నడవాలిగా !!
కనిపెట్టి చూస్తావా
కన్నీటి చుక్కైన
మొలిపించ వచ్చేమొ ఒక మొక్కనీ !
తలమించు భారంగా
తలపించు పనిలోంచి
గెలవొచ్చు పైకెగిరే ఒక రెక్కనీ !!
నరకాన్ని స్వర్గంగ
శత్రువుని నేస్తంగ
మార్పించు విద్యేదొ నేర్చెయ్ మరి
ముంచేటి అల ముందు
తలవొంచి తప్పించు
నేర్పేదొ చూపించు నీ తీరుకీ!!
ఒకేఒక్కసారి దొరికేటి
నిధి నీది ఈ జీవితం
నిడివెంతొ.. గడువేంటొ
తెలిసింది విధి ఒక్కటే..
ప్రేమిస్తూ గడపాలి
తడపొద్దు .. కాలాన్ని..
కన్నీటితో..!!
పద ముందుకు..
భయమెందుకు
కదిలేదే కదా జీవితం!
కష్టమైనా ..సుఖమైనా
ఎదురయ్యే ప్రతి అనుభవం
ఎదలోన దాచేసి
తుదివరకు నడవాలిగా !!
కనిపెట్టి చూస్తావా
కన్నీటి చుక్కైన
మొలిపించ వచ్చేమొ ఒక మొక్కనీ !
తలమించు భారంగా
తలపించు పనిలోంచి
గెలవొచ్చు పైకెగిరే ఒక రెక్కనీ !!
నరకాన్ని స్వర్గంగ
శత్రువుని నేస్తంగ
మార్పించు విద్యేదొ నేర్చెయ్ మరి
ముంచేటి అల ముందు
తలవొంచి తప్పించు
నేర్పేదొ చూపించు నీ తీరుకీ!!
ఒకేఒక్కసారి దొరికేటి
నిధి నీది ఈ జీవితం
నిడివెంతొ.. గడువేంటొ
తెలిసింది విధి ఒక్కటే..
ప్రేమిస్తూ గడపాలి
తడపొద్దు .. కాలాన్ని..
కన్నీటితో..!!
No comments:
Post a Comment